Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కల్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్

  • హీరోగా కల్యాణ్ రామ్ కి దక్కని హిట్
  • మైత్రీ నిర్మాతలకి ఒక మాట వేసిన ఎన్టీఆర్ 
  • కల్యాణ్ రామ్ కి సరిపడే కథ కోసం అన్వేషణ
కల్యాణ్ రామ్ ఒక వైపున నిర్మాతగా ... మరో వైపున హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. నిర్మాతగా 'జై లవ కుశ' మినహా ఈమధ్య కాలంలో ఆయనకి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు లేవు. ఇక హీరోగాను ఆయన ఇటీవల కాలంలో హిట్ అందుకోలేదు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. 'జనతా గ్యారేజ్' చేసిన దగ్గర నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వారితో ఎన్టీఆర్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. కథ విషయంలోను వాళ్లు  చాలా కసరత్తు చేస్తారు. అలాగే ఒక ప్రాజెక్టును అనుకుంటే, ఖర్చు పెరిగినా కాంప్రమైజ్ కాకుండా దానిని పూర్తి చేస్తారు. అందువలన కల్యాణ్ రామ్ తో ఒక సినిమా చేయమని వాళ్లతో ఎన్టీఆర్ అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. దాంతో కల్యాణ్ రామ్ కి సరిపోయే ఒక కథ కోసం మైత్రీ వాళ్లు అన్వేషణ మొదలుపెట్టినట్టుగా సమాచారం. కథ ఓకే అయితే మిగతావన్నీ చకచకా సెట్ చేసేసే ఉద్దేశంతో నిర్మాతలు వున్నారు.  
ntr
kalyan ram

More Telugu News